హైదరాబాద్‌లో బుల్లెట్ ట్రైన్ హబ్‌ను శంషాబాద్ విమానాశ్రయానికి సమీపంలోని బహదూర్‌గూడలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్-ముంబయి, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై వయా అమరావతి కారిడార్ల మధ్య నడిచే బుల్లెట్ రైళ్ల కార్యకలాపాలన్నీ ఇక్కడి నుంచే నిర్వహించనున్నట్లు సమాచారం. సీఎం రేవంత్‌రెడ్డి సూచనల మేరకు రెవెన్యూ అధికారులు బహదూర్‌గూడలోని ప్రభుత్వ భూములను పరిశీలించి అనువైన ప్రదేశంగా గుర్తించారు.
శంషాబాద్ ఎయిర్పోర్ట్ రన్‌వేకు సమీపంలో ఉన్న సర్వే నంబర్లు 62, 28లో సుమారు 650 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. బుల్లెట్ ట్రైన్ హబ్‌కు 400 నుంచి 500 ఎకరాల భూమి అవసరమని రైల్వే అధికారులు సూచించడంతో ఈ ప్రాంతాన్ని ఎంపిక చేశారు.
అలాగే బుల్లెట్ ట్రైన్ హబ్‌కు ఆనుకుని 150 ఎకరాల్లో భారీ బస్ టెర్మినల్‌ను కూడా నిర్మించనున్నారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే బస్సులను శివార్లకే పరిమితం చేసి అక్కడి నుంచి ఎలక్ట్రిక్ బస్సుల ద్వారా నగరానికి ప్రయాణికులను తరలించే ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ఈ ప్రాజెక్టులతో బహదూర్‌గూడ ప్రాంతం మెగా ట్రాన్స్పోర్ట్ హబ్‌గా మారనుంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















