తెలంగాణ చేనేత ఉత్పత్తులను అంతర్జాతీయ స్థాయిలో పరిచయం చేసే దిశగా మరో కీలక అడుగు పడింది. మిస్ ఇండియా స్టార్ యూనివర్స్-2018 రష్మీ ఠాగూర్‌ను రాష్ట్ర చేనేత ఉత్పత్తుల బ్రాండ్ అంబాసిడర్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ నెల 17 నుంచి 21 వరకు ఫ్రాన్స్‌లో జరగనున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్-2026లో ఆమె తెలంగాణ చేనేత వస్త్రాలను ప్రదర్శించనున్నారు.
ఈ సందర్భంగా జీఐ ట్యాగ్ పొందిన పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు అంతర్జాతీయ ఫ్యాషన్ వేదికపై ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. భారత జౌళి మంత్రిత్వ శాఖ, చేనేత అభివృద్ధి కమిషనర్ కార్యాలయం, హైదరాబాద్ చేనేత సేవా కేంద్రం సహకారంతో ‘హౌస్ ఆఫ్ వెండోమ్ పారిస్’ ఆధ్వర్యంలో నిర్వహించే ఫ్యాషన్ షోలో ఆమె పాల్గొంటారు.
తెలంగాణ చేనేత సంప్రదాయాన్ని ప్రపంచానికి పరిచయం చేయడంలో ఈ కార్యక్రమం కీలకంగా నిలవనుందని అధికారులు పేర్కొన్నారు. పోచంపల్లి వస్త్రాలకు కేన్స్ వేదికపై లభించే ప్రాధాన్యం రాష్ట్ర చేనేత రంగానికి కొత్త గుర్తింపును తీసుకురానుందని భావిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















