రాష్ట్రంలోని 22 జిల్లాల్లో మహిళా సమాఖ్యలకు ఇందిరా మహిళాశక్తి పేరుతో సొంత భవనాలు సిద్ధమవుతున్నాయి. వచ్చే నెల 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వీటిని ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
గత ఏడాది వరకు పది జిల్లాల్లో భవనాల నిర్మాణం పూర్తి చేసిన ప్రభుత్వం, ఈసారి ఒకేసారి 22 జిల్లాల్లో నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. హనుమకొండ, మేడ్చల్, మంచిర్యాల, సిరిసిల్ల, కామారెడ్డి, నిజామాబాద్, ములుగు, నారాయణపేట, జగిత్యాల, భూపాలపల్లి, వనపర్తి, మెదక్, సూర్యాపేట, యాదాద్రి, నాగర్‌కర్నూల్, నిర్మల్, మహబూబాబాద్, భద్రాద్రి, జనగామ, ఆసిఫాబాద్, పెద్దపల్లి, గద్వాల జిల్లాల్లో ఒక్కో భవనానికి రూ.5 కోట్ల చొప్పున మొత్తం రూ.110 కోట్లు కేటాయించారు.
సుమారు 15 వేల చదరపు గజాల్లో ఈ భవనాలను నిర్మించాలని నిర్ణయించారు. రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ పర్యవేక్షణలో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ద్వారా పనులు చేపట్టారు. ఇప్పటివరకు 17 భవనాలు పూర్తికాగా, మిగిలినవి తుది దశలో ఉన్నాయి.
వచ్చే నెల 2న ఒకేసారి 22 జిల్లాల్లో వీటిని ప్రారంభించేందుకు పనులు వేగవంతం చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు మహిళా సంఘాలకు సొంత కార్యాలయాలు లేకపోవడంతో సమావేశాలు, శిక్షణలు, ఉత్పత్తుల ప్రదర్శనలకు ఇబ్బందులు ఎదురయ్యేవి. కొత్త భవనాల్లో అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















