ఆర్థిక సంక్షోభంతో దివాలా తీసిన Spirit Airlines ను కొనుగోలు చేద్దామంటూ ఓ టిక్‌టాక్ క్రియేటర్ చేసిన సరదా వ్యాఖ్య ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అమెరికాకు చెందిన టిక్‌టాక్ ఇన్‌ఫ్లుయెన్సర్ Hunter Peterson ప్రారంభించిన “Let’s Buy Spirit Air” ప్రచారానికి ఊహించని స్థాయిలో ప్రజల మద్దతు లభిస్తోంది.
మూడు దశాబ్దాలుగా తక్కువ ధరలకు విమాన సర్వీసులు అందించిన స్పిరిట్ ఎయిర్‌లైన్స్ ఆర్థికంగా తీవ్ర నష్టాల్లోకి వెళ్లి ఇటీవల కార్యకలాపాలను నిలిపివేసింది. ఈ నేపథ్యంలో హంటర్ పీటర్సన్ సరదాగా ఒక టిక్‌టాక్ వీడియో రూపొందిస్తూ “మనమే ఈ ఎయిర్‌లైన్‌ను కొనేద్దాం” అని పిలుపునిచ్చాడు.
అయితే ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో లక్షలాది మంది స్పందించారు. ప్రజల ఉత్సాహాన్ని గమనించిన హంటర్, ప్రత్యేకంగా ఒక వెబ్‌సైట్ ప్రారంభించి, విమాన సంస్థను ప్రజల యాజమాన్య సంస్థగా మార్చే ఆలోచనను ముందుకు తీసుకొచ్చాడు. ఇందులో భాగంగా పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి ఉన్నవారు తమ ఆర్థిక సహకారం వివరాలు నమోదు చేసే విధంగా ప్లాట్‌ఫామ్‌ను రూపొందించారు.
శనివారం నాటికి దాదాపు 335 మిలియన్ డాలర్లు, అంటే భారత కరెన్సీలో రూ.3 వేల కోట్లకు పైగా సహకరించేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. అయితే ఇప్పటివరకు ఎవరినుంచీ ప్రత్యక్షంగా డబ్బు సేకరించలేదని హంటర్ స్పష్టం చేశాడు. మొదట ఈ ఆలోచనను కేవలం సరదాగా మాత్రమే చెప్పానని, కానీ ప్రజల స్పందన చూసి ఆశ్చర్యపోయానని వెల్లడించాడు.స్పిరిట్ ఎయిర్‌లైన్స్ మే 2న అధికారికంగా కార్యకలాపాలు నిలిపివేసింది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో సేవలను రద్దు చేసింది. ప్రస్తుతం ఈ ఫండ్‌రైజింగ్ ప్రయత్నం నిజంగా విమాన సంస్థ పునరుద్ధరణకు దారి తీస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















