ముడి చమురు ధరలు, రవాణా ఖర్చులు, ప్యాకేజింగ్ వ్యయాల పెరుగుదలతో నిత్యావసర వస్తువుల ధరలు మళ్లీ పెరిగే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఇంటి బడ్జెట్‌పై మరింత భారం పడనుంది.సబ్బులు, డిటర్జెంట్లు, బిస్కెట్లు, ప్యాకేజ్డ్ ఫుడ్స్, పానీయాలు వంటి ఉత్పత్తులను తయారు చేసే FMCG కంపెనీలు మరోసారి ధరల పెంపుకు సిద్ధమవుతున్నట్లు సంకేతాలు ఇచ్చాయి. ఇప్పటికే కొన్ని ఉత్పత్తుల ధరలను 3% నుంచి 5% వరకు పెంచినప్పటికీ, ఖర్చుల ఒత్తిడి కొనసాగుతుండటంతో మరింత పెంపు అవసరమని కంపెనీలు పేర్కొంటున్నాయి.
డాబర్, బ్రిటానియా, హెచ్‌యూఎల్, పిడిలైట్ వంటి ప్రముఖ సంస్థలు ముడి సరకుల ధరలు, డాలర్‌తో రూపాయి మారకం విలువ తగ్గడం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఖర్చులు భారీగా పెరిగాయని వెల్లడించాయి.Dabur India గ్లోబల్ సీఈఓ మోహిత్ మల్హోత్రా ఇప్పటికే ధరల సవరణ ద్వారా ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తగ్గిస్తున్నామని తెలిపారు. అదే విధంగా Britannia Industries ఉత్పత్తి ఖర్చులు 20% పెరిగాయని, అందుకే ధరల పెంపు లేదా ప్యాక్ పరిమాణం తగ్గింపు మార్గాలను పరిశీలిస్తున్నట్లు తెలిపింది.
Hindustan Unilever Limited కూడా ముడి సరకుల ఒత్తిడితో కొన్ని ఉత్పత్తుల ధరలను ఇప్పటికే పెంచామని, పరిస్థితి ఇలాగే కొనసాగితే మరింత పెంపు తప్పదని స్పష్టం చేసింది. అలాగే Pidilite Industries కూడా ఇప్పటికే రెండు విడతల్లో ధరలు పెంచి, మళ్లీ పెంపును పరిశీలిస్తోంది.ప్యాకేజ్డ్ నీళ్లు, పానీయాల కంపెనీలు Varun Beverages, Marico, Tata Consumer Products, అలాగే Nestlé India కూడా ధరల పెంపు అవకాశాలను సూచించాయి.దీంతో రాబోయే రోజుల్లో నిత్యావసర వస్తువుల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని, వినియోగదారులపై ఆర్థిక భారం పెరగనుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















