ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సంస్థ పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ షేర్లు స్టాక్ మార్కెట్లో భారీగా పుంజుకున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో షేరు 9 శాతానికి పైగా లాభపడి రూ.1,573.50 స్థాయికి చేరింది. ఒక్క సెషన్‌లోనే దాదాపు రూ.131 మేర పెరిగింది.
ఈ ర్యాలీకి ప్రధాన కారణంగా గ్లోబల్ బ్రోకరేజీ సంస్థ బెర్న్‌స్టీన్ పేటీఎం టార్గెట్ ధరను భారీగా పెంచడం నిలిచింది. గతంలో రూ.1,500గా ఉన్న టార్గెట్‌ను ఏకంగా రూ.2,200కు సవరించింది. ‘ఔట్‌పెర్ఫార్మ్’ రేటింగ్‌ను కొనసాగించింది. తాజా అంచనా ప్రకారం షేరుకు మరింత పైకి వెళ్లే అవకాశం ఉందని బ్రోకరేజీ సంస్థ పేర్కొంది.
పేటీఎం 2021లో రూ.2,150 ఇష్యూ ధరతో మార్కెట్లోకి వచ్చింది. అయితే ఇప్పటివరకు ఆ స్థాయిని తిరిగి అందుకోలేకపోయింది. తాజాగా బెర్న్‌స్టీన్ ఇచ్చిన రూ.2,200 టార్గెట్ అంచనాలు ఇన్వెస్టర్లలో ఆసక్తిని పెంచాయి.
యూపీఐ ఛార్జీలు కలిసొస్తాయా?
యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ ఛార్జీలు విధించే ప్రతిపాదనలు పేటీఎంకు సానుకూలంగా మారొచ్చని బెర్న్‌స్టీన్ అంచనా వేస్తోంది. ఇవి 2027-28 ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.
ఈ ఛార్జీలు అమల్లోకి వస్తే పేటీఎం నికర పేమెంట్ మార్జిన్లు 3–4 బేసిస్ పాయింట్లు పెరగవచ్చని బ్రోకరేజీ సంస్థ తెలిపింది. అలాగే 2029-30 ఆర్థిక సంవత్సరానికి పేటీఎం షేరుకు వచ్చే ఆదాయం గత అంచనాలతో పోలిస్తే సుమారు 30 శాతం పెరగవచ్చని అంచనా వేసింది.
అయితే డిజిటల్ లావాదేవీలపై ప్రతిపాదిత ఛార్జీల భారం వినియోగదారులపై ఉండదని, వ్యాపారులపైనే ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews


















