పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య ఇరాన్ కీలక వ్యాఖ్యలు చేసింది. లెబనాన్ సహా ప్రాంతమంతా యుద్ధం శాశ్వతంగా ముగియాలని తమ అభిలాష అని ఇరాన్ తెలిపింది. అమెరికా పంపిన శాంతి ప్రతిపాదనపై స్పందించిన ఇరాన్, నౌకా రవాణా భద్రతను కూడా ముఖ్యాంశంగా పేర్కొంది.
ఈ స్పందనను పాకిస్థాన్ మధ్యవర్తుల ద్వారా అమెరికాకు పంపినట్లు పాక్ ప్రధాని Shehbaz Sharif ధ్రువీకరించారు. అయితే వైట్ హౌస్ ఇంకా దీనిపై అధికారిక స్పందన ఇవ్వలేదు.ఇదిలా ఉండగా పశ్చిమాసియాలో డ్రోన్ దాడులు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. తమ గగనతలంలోకి వచ్చిన రెండు డ్రోన్లను కూల్చివేసినట్లు United Arab Emirates ప్రకటించింది. అలాగే కువైట్ కూడా అనుమానాస్పద డ్రోన్లను ధ్వంసం చేసినట్లు తెలిపింది.
ఖతార్ తీరంలో ఓ వాణిజ్య నౌకపై డ్రోన్ దాడి జరిగి మంటలు చెలరేగిన ఘటన కూడా కలకలం రేపింది. ఈ దాడులకు ఇరాన్ కారణమని కొన్ని దేశాలు ఆరోపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ తమ శత్రువులను దీటుగా ఎదుర్కొంటామని హెచ్చరించారు. శాంతి చర్చలతో పాటు భద్రత అంశాలపైనా దృష్టి పెట్టాలని ఇరాన్ కోరుతోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















