వేరెబుల్స్ విభాగంలో గుర్తింపు తెచ్చుకున్న Mivi.. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. కంపెనీ తన తొలి 5G స్మార్ట్‌ఫోన్ ‘Mivi One 5G’ను భారత మార్కెట్లో విడుదల చేసింది. Snapdragon ప్రాసెసర్, 50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ వంటి ఫీచర్లతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. బడ్జెట్ ధరలో 5G ఫోన్ కోరుకునే వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని దీన్ని రూపొందించింది.
Mivi One 5Gలో 6.75 అంగుళాల HD+ IPS LCD డిస్ప్లేను అందించారు. ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. Qualcomm Snapdragon 4 Gen ప్రాసెసర్‌తో పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్ Android 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది.
కెమెరాల విషయానికి వస్తే.. వెనుక భాగంలో Samsung ISOCELL 50MP డ్యుయల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 8MP కెమెరాను అందించారు. ఇక ఫోన్లో 6,000mAh భారీ బ్యాటరీని అమర్చారు. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఫోన్‌తో పాటు ఛార్జింగ్ అడాప్టర్‌ను కూడా బాక్స్‌లో అందిస్తున్నారు. రెండేళ్ల పాటు OS అప్డేట్లు అందిస్తామని Mivi వెల్లడించింది.
మివి కేర్+ సేవలు
Mivi One 5G కొనుగోలు చేసే వారికి Mivi Care+ సర్వీస్‌ను ఉచితంగా అందించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఫోన్లో ఏదైనా సమస్య తలెత్తితే కస్టమర్లు ఇంటి నుంచే సర్వీస్ పొందే అవకాశం ఉంటుంది. కంపెనీ ప్రతినిధులు ఫోన్‌ను ఇంటి నుంచి పికప్ చేసి రిపేర్ అనంతరం తిరిగి కస్టమర్‌కు డెలివరీ చేస్తారు.
ఏడు రోజుల్లోగా ఫోన్ రిపేర్ పూర్తి కాకపోతే కొత్త స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తామని కంపెనీ పేర్కొంది. దేశవ్యాప్తంగా తమకు 500 సర్వీస్ సెంటర్లు ఉన్నాయని తెలిపింది.
ధరలు ఇవే..
Mivi One 5Gను మూడు వేరియంట్లలో విడుదల చేశారు. 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999గా నిర్ణయించారు. 6GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ రూ.14,999కు, 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.16,499కు లభిస్తుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ అక్టోబర్ 8 నుంచి Flipkartలో విక్రయానికి రానుంది. ప్రారంభ ఆఫర్లో భాగంగా Axis Bank, HDFC Bank, ICICI Bank, SBI క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేసే వారికి రూ.1,000 వరకు తక్షణ డిస్కౌంట్ లభించనుంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















