Pakistan గురించి అమెరికా మీడియాలో సంచలన కథనాలు వెలువడ్డాయి. ఇటీవల Iran – United States మధ్య జరిగిన ఘర్షణల సమయంలో, ఇరాన్ సైనిక విమానాలను పాకిస్థాన్ రహస్యంగా తమ ఎయిర్‌బేస్‌లలో నిలిపేందుకు అనుమతించినట్లు వార్తలు వెల్లడించాయి.
ఆ కథనాల ప్రకారం, రావల్పిండిలోని Nur Khan Airbase లో ఇరాన్‌కు చెందిన పలు సైనిక విమానాలు నిలిపి ఉంచినట్లు తెలుస్తోంది. లాక్‌హీడ్ సి-130 హెర్క్యులస్ రవాణా విమానం, ఇరాన్ వైమానిక దళానికి చెందిన ఆర్‌సీ-130 విమానాలు కూడా అక్కడ ఉన్నట్లు పేర్కొన్నారు.అమెరికా దాడుల నుంచి తమ సైనిక, వైమానిక ఆస్తులను రక్షించుకునేందుకే ఇరాన్ ఈ చర్యలు చేపట్టిందని కథనాలు పేర్కొన్నాయి. అలాగే టెహ్రాన్‌కు చెందిన ఒక పౌర విమానాన్ని Afghanistan లో నిలిపినట్లు సమాచారం.
అయితే ఈ ఆరోపణలను పాకిస్థాన్ సీనియర్ అధికారులు ఖండించారు. నూర్ ఖాన్ ఎయిర్‌బేస్ జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఉండటంతో ఇలాంటి రహస్య కార్యకలాపాలు జరగడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. అఫ్గానిస్థాన్ అధికారులు కూడా ఒక ఇరాన్ పౌర విమానం మాత్రమే అక్కడ దిగిందని తెలిపారు.ఇక Lindsey Graham ఈ అంశంపై స్పందిస్తూ, ఈ కథనాలు నిజమైతే యుద్ధ విరమణలో మధ్యవర్తిగా పాక్ పాత్రను పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















