AP EAPCET పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ఈ పరీక్షలను జేఎన్టీయూ కాకినాడ నిర్వహిస్తోంది.
నేటి నుంచి ఈ నెల 20 వరకు విడతల వారీగా పరీక్షలు జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3.55 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. మొత్తం 48 పట్టణాల్లో 142 కేంద్రాల్లో ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతున్నాయి. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతి లేకపోవడంతో విద్యార్థులు చివరి నిమిషంలో పరుగులు తీస్తూ కేంద్రాలకు చేరుకున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















