ప్రపంచ ఇంటర్నెట్ కనెక్టివిటీని విప్లవాత్మకంగా మార్చే లక్ష్యంతో ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ సంస్థ భారీ స్థాయిలో ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపుతోంది. 1957 నుంచి ఇప్పటివరకు ప్రపంచ దేశాలు, సంస్థలు కలిపి సుమారు 15,062 ఉపగ్రహాలు ప్రయోగించగా, స్పేస్‌ఎక్స్ ఒక్కటే 14,844 ఉపగ్రహాలను ప్రయోగించడం విశేషం.
మరిన్ని 200 ఉపగ్రహాలు ప్రయోగిస్తే ప్రపంచంలోనే అత్యధిక ఉపగ్రహాలు ప్రయోగించిన సంస్థగా స్పేస్‌ఎక్స్ చరిత్ర సృష్టించనుంది. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద రాకెట్ వ్యవస్థ అయిన స్టార్‌షిప్ అభివృద్ధిపై వేగంగా పనిచేస్తోంది.
అయితే, స్టార్‌లింక్ ఉపగ్రహాల భారీ సంఖ్య వల్ల ఖగోళ పరిశోధనలకు ఆటంకాలు కలుగుతున్నాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్లాక్ హోల్స్, దూర గెలాక్సీల పరిశీలనలో ఇబ్బందులు, అలాగే కక్ష్య రద్దీ మరియు అంతరిక్ష శిథిలాల సమస్యలు పెరుగుతున్నాయని చెబుతున్నారు.ఇదే సమయంలో భారత్ కూడా అంతరిక్ష రంగంలో తన ఉనికిని బలపరుస్తోంది. ప్రస్తుతం కక్ష్యలో 86 భారత ఉపగ్రహాలు ఉండగా, వాటిలో 27 మాత్రమే పనిచేస్తున్నాయి. కమ్యూనికేషన్, నావిగేషన్, భూ పరిశీలన వంటి రంగాల్లో ఇస్రో కీలక పాత్ర పోషిస్తోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















