అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం ఆర్కడియా నగర మేయర్ ఐలీన్ వాంగ్‌పై ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) తీవ్ర ఆరోపణలు చేసింది. ఆమె చైనా ప్రభుత్వానికి అక్రమ ఏజెంట్‌గా పనిచేసినట్లు అభియోగాలు నమోదు చేసింది.
58 ఏళ్ల ఐలీన్ వాంగ్ 2022లో మేయర్‌గా ఎన్నికయ్యారు. అయితే ఎన్నికకు ముందు నుంచే ఆమె పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా (PRC) కోసం అనధికారికంగా పనిచేసినట్లు ఎఫ్‌బీఐ వెల్లడించింది. ఆమె చైనీస్ అమెరికన్ల కోసం ఒక వార్తా వెబ్‌సైట్ నడిపినట్లు, అందులో చైనాకు అనుకూలంగా ప్రచారం చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.
2020 నుండి 2022 మధ్య ఈ వెబ్‌సైట్ ద్వారా చైనా ప్రభుత్వ ప్రయోజనాలను బలపరిచే కంటెంట్ ప్రచురించినట్లు అధికారులు తెలిపారు. చైనా ప్రభుత్వ అధికారుల ఆదేశాల మేరకు అమెరికాలో కార్యకలాపాలు నిర్వహించినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.తాజాగా జరిగిన విచారణలో ఆమె కొన్ని విషయాలను అంగీకరించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆమె మేయర్ పదవికి రాజీనామా చేశారు. ఈ కేసులో నేరం రుజువైతే ఆమెకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















