అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గిరిజన గ్రామమైన పెదపాడులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీ నెరవేరడంతో గ్రామస్థుల్లో ఆనందం వెల్లివిరిసింది. గతేడాది ఏప్రిల్ 7న అరకు నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన “అడవితల్లి బాట” కార్యక్రమంలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డుంబ్రిగూడ మండలం పెదపాడు గ్రామాన్ని సందర్శించి అక్కడి ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు.
చాపరాయి నుంచి పెదపాడు వరకు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను పరిశీలించారు. అప్పటికే శిథిలావస్థకు చేరుకున్న స్కూల్ భవనంలో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఉపాధ్యాయులు పవన్ దృష్టికి తీసుకెళ్లారు. చిన్నారుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వెంటనే స్పందించిన పవన్ కల్యాణ్, కొత్త పాఠశాల భవనం నిర్మిస్తామని సభావేదికపైనే హామీ ఇచ్చారు.
ఇచ్చిన మాట ప్రకారం రూ.17.50 లక్షల వ్యయంతో ఆధునిక సౌకర్యాలతో నూతన పాఠశాల భవనం నిర్మాణం పూర్తి చేశారు. ఈ భవనం 2026 విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు అందుబాటులోకి రానుంది. కొత్త భవనం రావడంతో విద్యార్థులు సురక్షితమైన వాతావరణంలో చదువుకునే అవకాశం లభించనుంది.గ్రామంలో విద్యా వసతులు మెరుగుపడటంతో పాటు గిరిజన ప్రాంత అభివృద్ధికి ఇది మంచి అడుగుగా స్థానికులు అభిప్రాయపడుతున్నారు. హామీ ఇచ్చి నిలబెట్టుకున్న పవన్ కల్యాణ్‌పై గ్రామ ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నారు. “మాట తప్పని నాయకుడు పవన్ కల్యాణ్” అంటూ గ్రామస్థులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















