కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌పై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె, భగీరథ్‌పై తీవ్ర నేరారోపణలు ఉన్న నేపథ్యంలో పోలీసులు వెంటనే లుక్ అవుట్ నోటీసులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. విదేశాలకు పారిపోయే అవకాశాలు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
బాధితురాలి ఫొటోలు బయటపెట్టిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని కూడా కవిత కోరారు. బాధితురాలి గోప్యతను భంగం కలిగించేలా వ్యవహరించడం అత్యంత దారుణమని విమర్శించారు.
ఇక భగీరథ్‌పై ఆరోపణలు తీవ్రంగా ఉన్న సమయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రధాని నరేంద్రమోదీతో ఒకే వేదికపై కనిపించడం శోచనీయమని కవిత విమర్శించారు. చట్టం ముందు అందరూ సమానమేనని, కేసులో నిజాలు వెలుగులోకి రావాలని ఆమె పేర్కొన్నారు.ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధానికి కారణమవుతోంది. పోలీసులు ఈ కేసులో ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















