మూడో దశ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు 16 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఈ దశలో సుమారు 3.94 లక్షల మంది బూత్ స్థాయి అధికారులు 36.73 కోట్ల మంది ఓటర్ల వద్దకు వెళ్లి వివరాలను సేకరించనున్నారు. డిసెంబర్ 23న త్రిపురలో ఈ ప్రక్రియ ముగియనుంది. ఎస్‌ఐఆర్‌కు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కేంద్ర ఎన్నికల సంఘం కోరింది.
ఆంధ్రప్రదేశ్‌లో జూన్ 5 నుంచి 14 వరకు సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు. జూన్ 15 నుంచి జులై 14 వరకు ఇంటింటి సర్వే చేపడతారు. జులై 21న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేసి, ఆగస్టు 20 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. సెప్టెంబర్ 22న తుది ఓటర్ల జాబితా ప్రకటించనున్నారు.
తెలంగాణలో జూన్ 15 నుంచి 24 వరకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జూన్ 25 నుంచి జులై 24 వరకు ఇంటింటి సర్వే కొనసాగనుంది. జులై 31న ముసాయిదా జాబితా విడుదల చేసి, సెప్టెంబర్ 28 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. అక్టోబర్ 1న తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews EntertainmentNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PoliticalUpdate PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews Telangana TelanganaNews TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















