ప్రజల గొంతుకగా నిలవాలనే ఉద్దేశంతో ‘ఐక్య ధైర్య సేనా సమితి’ని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. అందరూ ఐక్యంగా ఉండాలన్న లక్ష్యంతో ఈ ట్రస్ట్‌ను ఏర్పాటు చేశామని, దీని వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ సంస్థ కార్యకలాపాలను సొంత నిధులతో కొనసాగిస్తున్నామని, త్వరలో ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ ట్రస్ట్ తమకు ఒక బిడ్డ లాంటిదని భావిస్తూ, తన కుమారుడు ధైరవ్, కుమార్తె దేవసేన పేర్లను కలిపి ‘ఐక్య ధైర్య సేనా సమితి’గా నామకరణం చేసినట్లు చెప్పారు.
సినిమాల విషయానికి వస్తే, తనకు సినిమాల్లో మళ్లీ అవకాశాలు ఇచ్చిన దర్శకులు విజయ్ కనకమేడల, కార్తిక్ ఘట్టమనేనికి జీవితాంతం రుణపడి ఉంటానని భావోద్వేగంగా తెలిపారు. ప్రస్తుతం తాను అన్ని రకాల పాత్రలు చేయాలనే ఆసక్తితో ఉన్నానని, కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు మనసుకు నచ్చిన కథలనే ఎంచుకుంటూ వచ్చానని వివరించారు. స్క్రిప్ట్ ఎంపికలో ఎవరి జోక్యం ఉండదని కూడా స్పష్టం చేశారు.
వ్యక్తిగత జీవితంపై మాట్లాడుతూ, తన భార్య వృత్తి జీవితంలోకి తాను వెళ్లనని, అలాగే తన వృత్తి జీవితంలోకి ఆమె రారని అన్నారు. ఒకరినొకరం గౌరవించుకుంటూ తమ జీవితాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు. రాజకీయాలపై వస్తున్న ఊహాగానాలకు స్పందిస్తూ, తాము కొత్తగా రాజకీయాల్లోకి రావడం లేదని, పుట్టినప్పటి నుంచే రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబమని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తన భార్య తప్పకుండా పోటీ చేస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇక సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం తన చేతిలో ఐదారు సినిమాలు ఉన్నాయని, వాటికి సంబంధించిన అధికారిక ప్రకటనలు ఈ నెలలోనే రానున్నాయని వెల్లడించారు. జూన్ 7న ‘రక్షక్’ అనే కొత్త చిత్రాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ సినిమా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, మహిళా సాధికారత నేపథ్యంలో రూపొందుతోందని చెప్పారు. ఇందులో తాను డీసీపీ పాత్రలో కనిపించనున్నట్లు పేర్కొన్నారు. అదే రోజు ‘ఐక్య’కు సంబంధించిన పూర్తి వివరాలు కూడా వెల్లడిస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఒక సరదా సంఘటన కూడా చోటుచేసుకుంది. “మీ నాన్నతో ఉన్న గొడవలు సద్దుమణిగాయా?” అని మంచు మనోజ్‌ను ప్రశ్నించగా, ఆయన నవ్వుతూ “అది ఎవరిని అడగాలో మీకు తెలుసు కదా. కానీ మైక్‌తో వెళ్లకండి, వెళ్లినా హెల్మెట్ పెట్టుకోండి” అంటూ సరదాగా స్పందించి వేదికపై నవ్వులు పూయించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews EntertainmentNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















