కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి Manohar Lal Khattar తో సమావేశమై హైదరాబాద్‌లో కొనసాగుతున్న కీలక అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించినట్లు కేంద్రమంత్రి G. Kishan Reddy తెలిపారు.ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ, మూసీ నది పారిశుద్ధ్యం, నగర మౌలిక వసతుల అభివృద్ధి అంశాలపై సమావేశంలో చర్చ జరిగినట్లు వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 పథకం కింద మూసీనదిలో కలుస్తున్న మురుగు నీటిని శుద్ధి చేసేందుకు మొత్తం 39 సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లను మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టుల వ్యయం సుమారు రూ.3,975 కోట్లుగా ఉందన్నారు. ఈ ప్లాంట్ల ద్వారా రోజుకు 972 మిలియన్ లీటర్ల మురుగు నీటిని శుద్ధి చేసే సామర్థ్యం ఏర్పడనుందని చెప్పారు.అలాగే హైదరాబాద్ మెట్రో రెండో దశ డీపీఆర్ అందిన తర్వాత కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని ఖట్టర్ పేర్కొన్నారని కిషన్‌రెడ్డి తెలిపారు. మెట్రోకు సూత్రప్రాయ అంగీకారానికి కేంద్రానికి ఎలాంటి అభ్యంతరం లేదని, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు చెరో సగం ఖర్చుతో ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 162 కిలోమీటర్ల మేర మెట్రో రెండో దశ విస్తరణ ప్రతిపాదనలు సమర్పించిందని, వాటిపై కేంద్రం సానుకూలంగా స్పందిస్తున్నట్లు వెల్లడించారు.హైదరాబాద్ నగర అభివృద్ధికి, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని మనోహర్ లాల్ ఖట్టర్ స్పష్టం చేసినట్లు కిషన్‌రెడ్డి తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















