Iranతో జరిగిన ఘర్షణల్లో United Statesకు భారీ నష్టం జరిగినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. యుద్ధ సమయంలో అమెరికాకు చెందిన అత్యాధునిక ఎంక్యూ-9 రీపర్ డ్రోన్లు (MQ-9 Reaper drones) పెద్దఎత్తున ధ్వంసమైనట్లు సమాచారం.
ఇరాన్ దాడుల్లో అమెరికా దాదాపు 30 రీపర్ డ్రోన్లను కోల్పోయిందని కథనాలు పేర్కొంటున్నాయి. ఇందులో కొన్ని గాల్లోనే కూల్చివేయగా.. మరికొన్ని క్షిపణి దాడుల్లో నేలపైనే ధ్వంసమయ్యాయి. ఈ నష్టం పెంటగాన్ వద్ద ఉన్న మొత్తం డ్రోన్ నిల్వల్లో సుమారు 20 శాతానికి సమానమని తెలుస్తోంది.
ఈ MQ-9 రీపర్ డ్రోన్లు అమెరికా సైన్యంలో అత్యంత కీలకమైన మానవరహిత వైమానిక వ్యవస్థలుగా గుర్తింపు పొందాయి. ఒక్కో డ్రోన్ విలువ సుమారు 30 మిలియన్ డాలర్ల వరకు ఉంటుందని అంచనా. వీటిలో అత్యాధునిక కెమెరాలు, సెన్సార్లు, లక్ష్యాలను గుర్తించే సాంకేతిక వ్యవస్థలు ఉంటాయి.ఇరాన్‌తో జరిగిన యుద్ధంలో అమెరికా దళాలు ఈ డ్రోన్లను విస్తృతంగా వినియోగించాయి. అయితే భారీ సంఖ్యలో డ్రోన్లు కోల్పోవడం, ప్రస్తుతం వాటి ఉత్పత్తి కూడా మందగించడం అమెరికా రక్షణ వ్యవస్థకు గట్టి ఎదురుదెబ్బగా మారిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews EntertainmentNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















