వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని తిరుపతి రమాదేవి ఆస్పత్రి అధినేత డాక్టర్ శశిధర రెడ్డి హెచ్చరించారు. శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం, లవణాల అసమతుల్యత ఏర్పడటం వల్ల కిడ్నీ పనితీరు మందగించే అవకాశం ఉందని తెలిపారు. కిడ్నీలో రాళ్లు, మూత్ర సంబంధిత సమస్యలు వంటి లక్షణాలు కనిపించిన వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రాలను సంప్రదించాలని సూచించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎవరూ వైద్యానికి దూరం కాకూడదని పేర్కొంటూ, ప్రభుత్వ మరియు కార్పొరేట్ పథకాల ద్వారా రమాదేవి ఆస్పత్రిలో 100 శాతం ఉచిత, నగదురహిత చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు.
రమాదేవి ఆస్పత్రిలో కిడ్నీ, యూరాలజీ సమస్యలకు లేజర్ చికిత్సలు, ఈఎస్డబ్ల్యూఎల్, రిర్స్ లేజర్, కీహోల్ సర్జరీలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రక్త పరీక్షలు, అల్ట్రాసౌండ్, సీటీ స్కాన్‌లు, సర్జరీలు, ఇంప్లాంట్స్, స్టెంట్లు, రూమ్ చార్జీలు, భోజనం వంటి సేవలు కూడా ఉచితంగానే అందిస్తున్నట్లు చెప్పారు. అపాయింట్‌మెంట్ కోసం 24 గంటల హెల్ప్‌లైన్ నంబర్ 9849677970ను సంప్రదించవచ్చన్నారు.
రమాదేవి ఆస్పత్రి యూరాలజీ నిపుణుడు డాక్టర్ రాజేష్‌రెడ్డి మాట్లాడుతూ.. వేసవిలో శరీరంలో సోడియం తగ్గి పొటాషియం స్థాయులు పెరగడం వల్ల కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుందని తెలిపారు. దీన్ని నిర్లక్ష్యం చేస్తే కిడ్నీ పనితీరు క్రమంగా దెబ్బతింటుందని హెచ్చరించారు. తీవ్రమైన ఎండల కారణంగా డీహైడ్రేషన్, తలనొప్పి, అలసట, యూరిన్ తగ్గిపోవడం, యూరిన్ ముదురు రంగులో రావడం, కాళ్లు, పాదాలు, ముఖం వాపు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.
వేసవిలో రోజుకు కనీసం నాలుగు లీటర్ల నీరు తాగడం ఎంతో అవసరమని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లకుండా జాగ్రత్తపడాలని సూచించారు. శరీరంలో ఎలక్ట్రోలైట్స్ సమతుల్యతను కాపాడుకోవడం ద్వారా కిడ్నీ సమస్యలను ముందుగానే నివారించవచ్చని వైద్య నిపుణులు తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















