విజయనగరం జిల్లా Cheepurupalli మండలంలో శుక్రవారం రాత్రి వీచిన భారీ ఈదురు గాలులు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. పీకే పాలవలసతో పాటు పలు గ్రామాల్లో సాగు చేసిన అరటి తోటలు గెలలతో సహా నేలకొరిగాయి. చేతికందే సమయంలో ప్రకృతి విపత్తు తమ ఆశలను ఛిద్రము చేసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒక్కో రైతుకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు రైతులు తెలిపారు. ప్రభుత్వమే వెంటనే ఆదుకోవాలని కోరుతున్నారు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో పంట నష్టం వివరాలను సేకరిస్తున్నామని మండల ఉద్యానవన శాఖాధికారిణి ఎం. అనూష తెలిపారు.
ఇదే సమయంలో ఈదురు గాలుల ప్రభావంతో పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. పత్తికాయవలస, పెరిపి, కర్లం, అలజంగి గ్రామాల్లో చెట్ల కొమ్మలు విద్యుత్ స్తంభాలపై పడటంతో తీగలు తెగిపోయాయి. అలజంగి వద్ద 11 కేవీ విద్యుత్ స్తంభం, బెవరపేట వద్ద ఎల్.టి లైన్ స్తంభం విరిగిపోయినట్లు ట్రాన్స్కో అధికారులు తెలిపారు. తెగిపోయిన విద్యుత్ తీగలను మరమ్మతు చేసే పనులు కొనసాగుతున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews EntertainmentNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews


















