పవిత్ర పుణ్యక్షేత్రం Yadagirigutta Templeలో ముఖ్యమంత్రి Revanth Reddy పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. కంచి కామకోటి పీఠాధిపతి Sri Shankara Vijayendra Saraswathi Swami సమక్షంలో సంప్రదాయ వేదపాఠశాల భవన నిర్మాణానికి సీఎం శ్రీకారం చుట్టారు.
రూ.43.79 కోట్ల వ్యయంతో పెద్దగుట్ట ఆలయ నగరి లేఅవుట్ వద్ద 15 ఎకరాల విస్తీర్ణంలో వేదపాఠశాల భవనాన్ని నిర్మించనున్నారు. వచ్చే రెండేళ్లలో పనులు పూర్తి చేసి తరగతులు ప్రారంభించేలా ప్రణాళిక రూపొందించారు.
అదే విధంగా రూ.9.88 కోట్లతో నిత్య కల్యాణం, రంగ మండపం నిర్మాణం, రూ.1.41 కోట్లతో మెట్ల మార్గానికి పైకప్పు, రూ.1.44 కోట్లతో మాడ వీధులకు మెట్లు, రూ.43.5 కోట్లతో దీక్షాపరుల మండపం నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపనలు చేశారు. అనంతరం శ్రీలక్ష్మీ నరసింహస్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మంత్రులు Konda Surekha, Komatireddy Venkat Reddy, ఎంపీ Chamala Kiran Kumar Reddyతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















