హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుకు దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం కల్పించే కీలక ఒప్పందం కుదిరింది. రూ.13,600 కోట్ల రుణాలను రీఫైనాన్స్ చేసేందుకు Indian Railway Finance Corporationతో హైదరాబాద్ మెట్రోరైల్ లిమిటెడ్ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంపై దిల్లీలో ఐఆర్‌ఎఫ్‌సీ సీఎండీ మనోజ్‌కుమార్ దూబె, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి K. Ramakrishna Rao సమక్షంలో సంతకాలు జరిగాయి.
ఈ రీఫైనాన్స్ ఒప్పందం 20 ఏళ్ల కాలపరిమితితో ఉండగా, త్రైమాసిక చెల్లింపుల పద్ధతిలో రుణ సౌకర్యం కల్పించనున్నారు. ఈ చర్యతో హైదరాబాద్ మెట్రో ఆర్థిక భారం తగ్గి, భవిష్యత్ విస్తరణ ప్రాజెక్టులకు మార్గం సుగమం కానుంది.
ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ.. మెట్రో ప్రాజెక్ట్ 100 శాతం యాజమాన్య హక్కులు ప్రభుత్వానికి బదిలీ అయినట్లు తెలిపారు. పట్టణ రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
హైదరాబాద్ నగరం దేశ ఆర్థిక వృద్ధికి కీలక ఇంజిన్‌గా మారుతోందని, మెట్రో కనెక్టివిటీ పెరగడం ద్వారా ట్రాఫిక్ రద్దీ తగ్గి ప్రజలకు మెరుగైన ప్రయాణ సౌకర్యాలు లభిస్తాయని తెలిపారు. ఈ ఒప్పందానికి సహకరించిన కేంద్ర ప్రభుత్వం, ఐఆర్‌ఎఫ్‌సీ, ఎల్‌అండ్‌టీ, హెచ్‌ఎంఆర్‌ఎల్ బృందాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.హైదరాబాద్‌లో సమర్థవంతమైన, సుస్థిర ప్రజా రవాణా వ్యవస్థను విస్తరించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అధికారులు స్పష్టం చేశారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews EntertainmentNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews


















