ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం కొత్త అవకాశాన్ని అందిస్తోంది. ఎంఎస్‌ఎంఈ యూనిట్ల స్థాపన కోసం డ్వాక్రా మహిళలకు గరిష్ఠంగా రూ.10 లక్షల వరకు వ్యక్తిగత రుణం అందించనున్నట్లు సెర్ప్ శాఖ మంత్రి Kondapalli Srinivas తెలిపారు.
ఈ రుణాన్ని దీన్‌దయాల్ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనోపాధుల కార్యక్రమం కింద ఎలాంటి పూచీకత్తు లేకుండా అందించనున్నట్లు ఆయన వెల్లడించారు. దరఖాస్తుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐఈఎల్‌ఏ (Individual Enterprise Loan Application) విధానాన్ని డ్వాక్రా మహిళలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు.
ఇప్పటికే ఉన్న యూనిట్లతో పాటు కొత్తగా ప్రారంభించే సూక్ష్మ పరిశ్రమలకు కూడా ఈ రుణ సదుపాయం వర్తిస్తుందని తెలిపారు. వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు, ఫుడ్ ప్రాసెసింగ్, మునగ ఉత్పత్తులు, తేనె తయారీ, పుట్టగొడుగుల సాగు, నర్సరీలు, సోలార్ డ్రయ్యర్లు, రక్షిత సాగు, చేపల ప్రాసెసింగ్ వంటి అనేక రంగాల్లో ఈ పథకం ద్వారా ప్రోత్సాహం లభించనుంది.
రుణాల కోసం అవసరమైన డీపీఆర్ తయారీ, దరఖాస్తు ప్రక్రియలో సెర్ప్‌లోని వెలుగు విభాగం అధికారులు పూర్తి సహకారం అందిస్తారని మంత్రి తెలిపారు. గ్రామీణ మహిళలు స్వయం ఉపాధి దిశగా ముందుకు సాగేందుకు ఈ పథకం పెద్ద ఊతంగా నిలుస్తుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews


















