‘‘నేనెప్పుడూ నా మనసుకు దగ్గరైన పాత్రలే చేస్తా. ఈ సినిమాలో గౌర్నాయుడు కూడా అలాంటిదే. ఇది చాలా అద్భుతమైన కథ. నా పాత్రకి ఓ లక్ష్యం, మంచి ఉద్దేశం ఉంటుంది. దీన్ని దర్శకుడు బుచ్చిబాబు ఎంతో చక్కగా తీర్చిదిద్దారు. అందుకే ఈ కథ విన్నాక తప్పకుండా ఈ సినిమాలో భాగం కావాలనిపించింది. దీంట్లో నాది కోచ్ పాత్రలాగే ఉంటుంది. ‘పెద్ది’ ప్రయాణం అద్భుతంగా సాగుతుంది. ఈ క్రమంలోనే తన దారిలోకి ఎన్నో పాత్రలు వస్తాయి. ఇక పెద్దికి, నాకు మధ్య ఉండే అనుబంధం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మా ఇద్దరి మధ్య ప్రేమ, ఆప్యాయత, ఎమోషన్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది’’ అని అన్నారు.
‘‘ఈ సినిమాలో నటనకి గానూ రామ్‌చరణ్‌కి జాతీయ పురస్కారం వస్తుందని నమ్ముతున్నా. ఈ చిత్రం కోసం రెండేళ్ల పాటు ఎంతో అంకితభావంతో పని చేశారు. ‘పెద్ది’ పాత్రలో పూర్తిగా ఒదిగిపోయి ఎంతో నిజాయతీగా చేశారు. ఆ పాత్ర కోసం తన శరీరాన్ని పూర్తిగా మార్చుకున్న తీరు, తన నటన అన్నీ కట్టిపడేస్తాయి. దర్శకుడు బుచ్చిబాబు ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. కథకి ఏది అవసరమో దాన్నే తెరకెక్కించారు. ‘పెద్ది’ ప్రయాణం తప్పకుండా అందరికీ నచ్చుతుంది. దీంట్లోని సర్‌ప్రైజింగ్ క్లైమాక్స్‌ని థియేటర్‌లో చూసి ఆస్వాదించాలి’’ అని పేర్కొన్నారు.
‘‘దర్శకుడు కథ చెప్పాక ఆ పాత్ర కోసం నేను ఒక స్టైల్‌ని అనుకుంటా. దాన్ని దర్శకుడితో చర్చిస్తా. ఆ తర్వాత ఆయన సూచనలు, నా ఆలోచనలు కలిపి ఒక అవగాహనతో ఆ పాత్రని చేస్తా. ప్రతి సినిమాని నేనిలాగే చేస్తా. మంచి కథలొస్తే తప్పకుండా తెలుగులో వరుస సినిమాలు చేయాలని ఉంది. ప్రస్తుతం తెలుగులో ‘గుమ్మడి నర్సయ్య’ బయోపిక్ చేస్తున్నా. అలాగే రజనీకాంత్‌తో ‘జైలర్ 2’లో నటిస్తున్నా’’ అని తెలిపారు.
ఈ సందర్భంగా రామ్‌చరణ్ మాట్లాడుతూ.. ‘‘నేను నా జీవితంలో చేసిన అత్యంత స్ఫూర్తిదాయకమైన సినిమా ‘పెద్ది’. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత మళ్లీ అందరి ముందుకొస్తున్నా. ఈ చిత్రం కోసం మేమంతా ఎంతో నిజాయతీగా, ప్రాణం పెట్టి పని చేశాం. రాసిపెట్టుకోండి, ఇది అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుంది. ఈ సినిమా ద్వారా శివ రాజ్‌కుమార్ వంటి గొప్ప నటుడితో కలిసి పని చేయడం నా జన్మ ధన్యమైంది’’ అన్నారు.
ఈ కార్యక్రమంలో జాన్వీ కపూర్, శివ రాజ్‌కుమార్, వెంకట సతీశ్ కిలారు తదితరులు పాల్గొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















