దేశ ఆర్థిక రక్షణ కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పొదుపు పిలుపును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గట్టిగా సమర్థించారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఇంధనం, ఎరువులు, విదేశీ మారకపు ద్రవ్యం (ఫ్యూయల్, ఫెర్టిలైజర్, ఫారెక్స్)పై అందరూ దృష్టి పెట్టాలని ఆమె సూచించారు.
కొంతమంది ఈ చర్యలపై నిరాశావాద ప్రచారం చేస్తున్నారని ఆమె విమర్శించారు. దేశీయ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని, జీఎస్‌టీ వసూళ్లు, వాహన విక్రయాలు వంటి సూచీలు సానుకూలంగా ఉన్నాయని తెలిపారు. ప్రజల్లో భయాన్ని పెంచేలా వ్యాఖ్యలు చేయకూడదని హితవు పలికారు.
ఇంధన ధరలు, బంగారం ధరలు, ఎరువుల ఖర్చులు పెరగడం ఆర్థిక ఒత్తిడిని పెంచిందని ఆమె పేర్కొన్నారు. అందుకే పొదుపు చర్యలు అవసరమని స్పష్టం చేశారు.
MSME రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆర్థిక మంత్రి సూచించారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు సుమారు రూ.8.1 లక్షల కోట్ల చెల్లింపులు ఆలస్యంగా ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలు 45 రోజుల్లోగా చెల్లింపులు పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ చర్యలు MSMEల వర్కింగ్ క్యాపిటల్‌కు ఊతమిచ్చి, మధ్యతరగతి అభివృద్ధికి దోహదపడతాయని, అదే వికసిత్ భారత్ సాధనకు మార్గమని ఆమె పేర్కొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















