తెలంగాణ రాష్ట్రంలో పలుచోట్ల కురిసిన తేలికపాటి వర్షాలు ప్రజలకు భారీ ఊరటనిచ్చాయి. గత కొద్దిరోజులుగా మండే ఎండలు, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు.. మంగళవారం రాత్రి నుంచి ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో ఉపశమనం పొందారు.
హైదరాబాద్ నగరంలోని సికింద్రాబాద్, బాలానగర్, బోయిన్పల్లి, అమీర్పేట్, కూకట్పల్లి, కేపీహెచ్బీ, చందానగర్, మియాపూర్, గచ్చిబౌలి, లక్డీకాపూల్, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట, మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్నగర్, వరంగల్, హన్మకొండ తదితర జిల్లాల్లో వచ్చే 2 నుంచి 3 గంటల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశముందని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















