కోల్‌కతా కేంద్రంగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ బామర్ లారీ అండ్ కంపెనీ లిమిటెడ్ 62 ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బీటెక్, ఎంబీఏ, పీజీ అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ ట్రెయినీగా 23 పోస్టులు, జనరల్ మేనేజ్‌మెంట్ ట్రెయినీగా 39 పోస్టులు ఉన్నాయి. నెలకు రూ.40,000 నుంచి రూ.1,40,000 వరకు వేతనం లభిస్తుంది.ఎంపిక ప్రక్రియలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT), ధ్రువపత్రాల పరిశీలన, గ్రూప్ డిస్కషన్/గ్రూప్ టాస్క్, పర్సనల్ ఇంటర్వ్యూ, వైద్య పరీక్షలు ఉంటాయి. CBT 100 మార్కులకు జరుగుతుంది. జనరల్ ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్, లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్‌ప్రెటేషన్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ అంశాలపై ప్రశ్నలు ఉంటాయి.
వయసు పరిమితి ఇంజినీరింగ్ ట్రెయినీలకు 25 సంవత్సరాలు, జనరల్ మేనేజ్‌మెంట్ పోస్టులకు 27 సంవత్సరాలు. రిజర్వేషన్ కేటగిరీలకు నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 09.06.2026. పరీక్ష కేంద్రాలు హైదరాబాద్, విశాఖపట్నం సహా ప్రధాన నగరాల్లో ఉంటాయి.అభ్యర్థులు పూర్తి వివరాలకు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















