తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు మూడో రోజు ప్రారంభమైన వెంటనే ఎర్రవల్లి ఘటనపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఎస్సీలు నిరసన తెలిపిన ప్రాంతాన్ని శుద్ధి చేశారంటూ వచ్చిన అంశంపై కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఈ అంశంపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సభలో తీవ్రంగా స్పందించారు.
ఎస్సీలను బీఆర్‌ఎస్ అవమానిస్తోందని మంత్రి ఆరోపించారు. ఎర్రవల్లిలో ఎస్సీలు నిరసన తెలిపిన ప్రాంతాన్ని శుద్ధి చేస్తారా? అని ప్రశ్నించారు. శుద్ధి పేరుతో ఎస్సీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన బీఆర్‌ఎస్ నేతలు ఎస్సీలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆత్మగౌరవం కోసమే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని మంత్రి పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఎస్సీలపై వివక్ష కొనసాగడం బాధాకరమన్నారు. శుద్ధి పేరుతో బీఆర్‌ఎస్ నేతలు చేసిన చర్యపై వారు ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.
అదేవిధంగా స్పీకర్ విషయంలో జరిగిన ఘటనపైనా బీఆర్‌ఎస్ నేతలకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని మంత్రి విమర్శించారు. ఎస్సీల గౌరవం, హక్కుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీ పడబోదని స్పష్టం చేశారు.
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రసంగిస్తున్న సమయంలో బీఆర్‌ఎస్ సభ్యులు పలుమార్లు అడ్డుకున్నారు. దీంతో సభలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీఆర్‌ఎస్ సభ్యులు ‘వియ్ వాంట్ జస్టిస్’ అంటూ నినాదాలు చేయడంతో సభ హోరెత్తింది. ఎర్రవల్లి ఘటనపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















