అమెరికా–ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కోసం ప్రయత్నాలు కొనసాగుతున్న సమయంలోనే ఇరు దేశాలు మళ్లీ పరస్పర దాడులకు దిగడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ అధికారిక మీడియా సంచలన ప్రకటన చేస్తూ, అమెరికాకు చెందిన ఓ యుద్ధ విమానాన్ని తమ వైమానిక దళాలు కూల్చివేశాయని వెల్లడించింది. అయితే ఈ వార్తలను అమెరికా పూర్తిగా ఖండించింది. ఇలాంటి ఘటన ఏదీ జరగలేదని స్పష్టం చేసింది.
శుక్రవారం తెల్లవారుజామున బుషెహర్ ప్రావిన్స్‌లోని జామ్ ప్రాంతంలో శత్రుదేశానికి చెందిన ఫైటర్ జెట్‌ను గుర్తించి అడ్డుకున్నామని టెహ్రాన్ మీడియా పేర్కొంది. స్థానిక గవర్నర్‌ను ఉటంకిస్తూ, ఇరాన్ వైమానిక దళాలు ఆ యుద్ధ విమానాన్ని కూల్చివేశాయని తెలిపింది. అయితే ఘటనలో ఎవరైనా ప్రాణాలు కోల్పోయారా అనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం బుషెహర్ ప్రాంతంలో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని వెల్లడించింది.
ఇక ఈ ఘటనకు సంబంధించినట్లుగా ఓ యుద్ధవిమానం మంటల్లో కూలిపోతున్న ఫొటోను ఇరాన్ ఆర్మీ తమ అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. దీంతో ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మరోవైపు అమెరికా సెంట్రల్ కమాండ్ స్పందిస్తూ, బుషెహర్ సమీపంలో తమ యుద్ధవిమానాన్ని కూల్చేశామన్న ఇరాన్ ప్రచారం పూర్తిగా అసత్యమని పేర్కొంది. ఇలాంటి తప్పుడు ప్రచారాలతో ప్రపంచాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించింది.
ఇప్పటికే అణు కార్యక్రమం, హర్మూజ్ జలసంధి, ఆంక్షలు వంటి అంశాలపై అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండగా.. తాజా పరిణామాలు మధ్యప్రాచ్య పరిస్థితులను మరింత ఆందోళనకరంగా మార్చాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇరు దేశాలు మళ్లీ సైనిక చర్యలను పెంచితే గల్ఫ్ ప్రాంత భద్రత, అంతర్జాతీయ చమురు సరఫరాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















