Reserve Bank of India సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC) వినియోగాన్ని మరింత విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రిటైల్ రంగం, ప్రజా పంపిణీ వ్యవస్థల్లో డిజిటల్ రూపాయి వినియోగాన్ని పెంచాలని భావిస్తోంది. ఇప్పటికే గుజరాత్, పుదుచ్చేరి, చండీగఢ్‌లలో నగదు బదిలీ పథకాల కింద పైలట్ ప్రాజెక్ట్ నిర్వహించినట్లు ఆర్‌బీఐ వెల్లడించింది.
రేషన్ షాపులు, ఎంపిక చేసిన వ్యాపారుల వద్ద మాత్రమే వినియోగించేలా సబ్సిడీ నిధులను డిజిటల్ రూపంలో లబ్ధిదారులకు అందించారు. దీంతో ప్రభుత్వ పథకాల పారదర్శకత పెరగడంతో పాటు నిధుల దుర్వినియోగం తగ్గే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు.
ఇక దేశ ఆర్థిక పరిస్థితులపై కూడా ఆర్‌బీఐ తన వార్షిక నివేదికలో కీలక వ్యాఖ్యలు చేసింది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ఇంధన ధరల పెరుగుదల, సరఫరా వ్యవస్థలో సమస్యలు ఉన్నప్పటికీ భారత్ ఆర్థిక వృద్ధికి ఎలాంటి ముప్పు లేదని పేర్కొంది. బలమైన బ్యాంకింగ్ వ్యవస్థ, కార్పొరేట్ రంగం, ప్రభుత్వ మూలధన వ్యయం దేశ వృద్ధికి ప్రధాన బలమని వెల్లడించింది.
2025-26లో భారత్ 7.6 శాతం వృద్ధి నమోదు చేసి ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని ఆర్‌బీఐ గుర్తుచేసింది. రాబోయే ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగం నైరుతి రుతుపవనాలపై ఆధారపడనున్నప్పటికీ, హిందూ మహాసముద్ర డైపోల్ ప్రభావం వల్ల ఎల్‌నినో ప్రభావాన్ని కొంతవరకు అధిగమించే అవకాశముందని తెలిపింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















