Royal Enfield దేశీయ మార్కెట్లో తన కొత్త బుల్లెట్ 650 బైక్‌ను అధికారికంగా విడుదల చేసింది. క్లాసిక్ డిజైన్‌కు ఆధునిక ఫీచర్లను జోడిస్తూ ఈ బైక్‌ను రూపొందించింది. రూ.3.65 లక్షల ఎక్స్‌షోరూమ్ ధరతో వచ్చిన ఈ బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ అభిమానులను ఆకట్టుకుంటోంది.
ఈ బైక్‌లో 648cc ప్యారలల్ ట్విన్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 46.4bhp పవర్, 52.3Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వచ్చిన ఈ బైక్ లాంగ్ రైడ్స్‌కు అనుకూలంగా ఉంటుంది.
షోవా టెలిస్కోపిక్ ఫోర్క్స్, ట్విన్ రియర్ షాక్ అబ్జార్బర్స్, డ్యూయల్ ఛానెల్ ABS వంటి ఫీచర్లు రైడింగ్‌ను మరింత సేఫ్‌గా మారుస్తాయి. అనలాగ్ స్పీడోమీటర్‌తో పాటు డిజిటల్ డిస్‌ప్లే, ట్రిప్పర్ నావిగేషన్ పాడ్ వంటి ఆధునిక టెక్నాలజీని కూడా ఇందులో అందించారు.
డిజైన్ విషయానికి వస్తే.. బుల్లెట్ 650 తన క్లాసిక్ స్టైల్‌ను కొనసాగించింది. చేతితో గీసిన పిన్‌స్ట్రైప్స్, రెక్కల బ్యాడ్జ్‌తో కూడిన టియర్‌డ్రాప్ ఫ్యూయల్ ట్యాంక్, గుండ్రని LED హెడ్‌ల్యాంప్, టైగర్ ఐ పైలట్ ల్యాంప్స్, క్రోమ్ హ్యాండిల్‌బార్లు, మిర్రర్స్, పీ-షూటర్ ఎగ్జాస్ట్‌లు ఈ బైక్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
కెనాన్ బ్లాక్, బాటిల్‌షిప్ బ్లూ కలర్ ఆప్షన్లలో ఈ బైక్ అందుబాటులోకి వచ్చింది. క్లాసిక్ లుక్, పవర్‌ఫుల్ పనితీరు కోరుకునే రైడర్స్‌కు ఇది మంచి ఎంపికగా నిపుణులు చెబుతున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















