కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ మిశ్ర ధాతు నిగమ్ (మిధాని) రక్షణ, అంతరిక్ష, విద్యుత్ రంగాలకు అవసరమైన టైటానియం మిశ్రమాలు, ప్రత్యేక ఉక్కులు, సూపర్ అల్లాయ్స్ తయారీలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సంస్థ తాజాగా గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి బలమైన ఫలితాలు ప్రకటించింది.
ఈ త్రైమాసికంలో ఏకీకృత ఆదాయం రూ.552.75 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.410.56 కోట్లతో పోలిస్తే ఇది 34.63 శాతం వృద్ధి. అదే సమయంలో నికర లాభం రూ.56.14 కోట్ల నుంచి 38.49 శాతం పెరిగి రూ.77.75 కోట్లకు చేరింది.
2025–26 ఆర్థిక సంవత్సరానికి సంస్థ చరిత్రలోనే అత్యధికంగా రూ.1,208.63 కోట్ల ఆదాయం నమోదైంది. నికర లాభం రూ.130.79 కోట్లుగా నిలిచింది. రూ.10 ముఖ విలువ గల ఒక్కో షేరుపై రూ.1.25 డివిడెండ్‌ను బోర్డు ప్రతిపాదించింది.
2026 ఏప్రిల్ 1 నాటికి సంస్థ చేతిలో ఉన్న మొత్తం ఆర్డర్ బుక్ విలువ రూ.2,290 కోట్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో 700 టన్నుల టైటానియం అల్లాయ్ ఉత్పత్తితో రికార్డు సాధించినట్లు మిధాని తెలిపింది.
అయోధ్య శ్రీరామ మందిర నిర్మాణానికి 31 టైటానియం కిటికీలను సరఫరా చేసినట్లు సంస్థ వెల్లడించింది. భవన నిర్మాణ రంగంలో టైటానియం సరఫరా చేసిన తొలి సంస్థగా నిలిచినట్లు పేర్కొంది. అలాగే దిల్లీలో రాష్ట్రపతి భవన్ వేదిక కోసం 90 టన్నుల ఆర్మర్ గ్రేడ్ స్టీల్‌ను తక్కువ సమయంలో సరఫరా చేసినట్లు తెలిపింది.
ఏరో ఇంజిన్ల కోసం దేశంలోనే తొలిసారిగా ‘కాస్ట్ సూపర్ అల్లాయ్ సింగిల్ క్రిస్టల్ బ్లేడ్’ మెటీరియల్‌ను అభివృద్ధి చేసినట్లు సంస్థ వివరించింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















