ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌లో భారీ స్థాయిలో హరిత కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ నెల 15వ తేదీ నాటికి రాష్ట్రవ్యాప్తంగా 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు.
ఎన్టీఆర్ జిల్లా మూలపాడు బటర్‌ఫ్లై పార్క్‌లో నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్, విద్యార్థులతో కలిసి సీడ్ బాల్స్ తయారు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి సీడ్ బాల్ ఒక చెట్టుగా ఎదిగి భూమిని వాతావరణ మార్పుల ప్రభావం నుంచి రక్షించే శక్తిని కలిగి ఉంటుందని పేర్కొన్నారు.
అడవులు, కొండ ప్రాంతాలు, నదీ తీరాలు వంటి ప్రాంతాల్లో ఈ సీడ్ బాల్స్‌ను వెదజల్లేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. మనుషులు చేరుకోలేని దూర ప్రాంతాల్లో డ్రోన్ల సహాయంతో సీడ్ బాల్స్‌ను చల్లనున్నట్లు వెల్లడించారు.
పర్యావరణ పరిరక్షణలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చిన పవన్ కళ్యాణ్, మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యతను కూడా ప్రతి ఒక్కరూ తీసుకోవాలని సూచించారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, పచ్చని వాతావరణాన్ని అందించేందుకు చెట్ల పెంపకం అత్యంత అవసరమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















