అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బస్సు ప్రమాదాన్ని కవర్ చేసేందుకు గాల్లోకి వెళ్లిన న్యూస్ హెలికాప్టర్ ఒక్కసారిగా కుప్పకూలడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన శాన్ ఫెర్నాండో వ్యాలీలోని ఛాట్స్‌వర్త్ ప్రాంతంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది.
అంతకుముందు అదే ప్రాంతంలో ఎస్‌యూవీ, మెట్రో బస్సు ఢీకొన్న ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. ఈ ప్రమాదాన్ని కవర్ చేసేందుకు పలు మీడియా సంస్థలకు చెందిన హెలికాప్టర్లు ఆ ప్రాంతంలో గాల్లో తిరుగుతున్నాయి.
అదే సమయంలో NBC4 కోసం పనిచేస్తున్న న్యూస్ చాపర్-4 కూడా ప్రమాద దృశ్యాలను కవర్ చేస్తోంది. సుమారు రాత్రి 7 గంటల సమయంలో హెలికాప్టర్ నియంత్రణ కోల్పోయి సమీపంలోని వాణిజ్య భవనాల మధ్య ఉన్న ప్రాంతంలో కూలిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే భారీగా మంటలు చెలరేగాయి. నాలుగు వాహనాలు, రెండు స్టోరేజ్ కంటైనర్లు కూడా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు.
ఈ ప్రమాదంలో హెలికాప్టర్‌లో ఉన్న ఇద్దరితో పాటు నేలపై ఉన్న మరో వ్యక్తి మృతి చెందారు. మరో వ్యక్తిని ఆసుపత్రికి తరలించినట్లు లాస్ ఏంజెలెస్ అగ్నిమాపక విభాగం వెల్లడించింది.
ఈ హెలికాప్టర్‌ను Angel City Air నిర్వహిస్తుండగా, NBC4 Los Angeles, Telemundo 52 కోసం వైమానిక వార్తా కవరేజీకి ఉపయోగిస్తున్నారు. ఘటనకు గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA), నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డు (NTSB) దర్యాప్తు చేపట్టాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















