ప్రతిష్ఠాత్మక నార్వే చెస్ టోర్నీ టైటిల్‌ను గెలిచిన తొలి భారతీయ ప్లేయర్‌గా 20 ఏళ్ల గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద (Praggnanandhaa) చరిత్ర సృష్టించాడు. ఈ ఘనతపై ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) హర్షం వ్యక్తం చేశారు.
ప్రజ్ఞానంద ప్రతిభ భారత క్రీడా చరిత్రలో ఒక కీలక మైలురాయిగా నిలిచిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భవిష్యత్తులో అతడు మరిన్ని అంతర్జాతీయ విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఇదే సమయంలో ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ సైతం ప్రజ్ఞానందను అభినందించారు.
ఈ విజయం అతని అసాధారణ ప్రతిభ, అచంచలమైన అంకితభావం, కఠినమైన శ్రమకు నిదర్శనమని ఉప రాష్ట్రపతి వ్యాఖ్యానించారు. ప్రపంచ వేదికపై భారత్‌ను గర్వపడేలా చేశాడని ప్రశంసించారు. ప్రజ్ఞానంద విజయం దేశంలోని యువ చెస్ క్రీడాకారులకు గొప్ప ప్రేరణగా నిలుస్తుందని తెలిపారు.
నార్వే చెస్ టోర్నీ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడిగా ప్రజ్ఞానంద ఘనత సాధించాడు. ఇది అతనికి రెండో నార్వే చెస్ టోర్నీ మాత్రమే కావడం విశేషం. ఈ టోర్నీలో అతను ప్రపంచ నంబర్ 1 మాగ్నస్ కార్ల్‌సన్‌ను రెండుసార్లు ఓడించాడు.
మొదటి ఆరు రౌండ్లలో మూడు ఓటములు ఎదురైనా, ఆ తర్వాత అద్భుతంగా పుంజుకున్న ప్రజ్ఞానంద వరుసగా నాలుగు విజయాలు సాధించి టైటిల్‌ను అందుకున్నాడు. చివరి రౌండ్‌లో గుకేశ్ ఓటమి పాలయ్యాడు. అతడిని మాగ్నస్ కార్ల్‌సన్ ఓడించడంతో గుకేశ్ 8 పాయింట్లతో చివరి స్థానానికి పరిమితమయ్యాడు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















