పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) కీలక సమావేశానికి అధ్యక్షత వహించారు. శనివారం ఆయన పీఎం ఆర్థిక సలహా మండలి (Economic Advisory Council to the Prime Minister)తో భేటీ అయ్యారు.
యుద్ధం ముగింపుపై ఇంకా స్పష్టత లేకపోవడంతో, దాని ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం, వృద్ధి కొనసాగింపుపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
దేశ ఆర్థిక వృద్ధిని మరింత బలోపేతం చేయడం, బయటి ఒడుదొడుకులను తట్టుకునే సామర్థ్యాన్ని పెంచడం వంటి అంశాలు చర్చలో ప్రధానంగా నిలిచాయి. అలాగే వ్యాపారాలకు అనుకూలమైన వాతావరణం కల్పించేలా అవసరమైన సంస్కరణలను వేగవంతం చేయాలని సూచించినట్లు తెలుస్తోంది.
గ్లోబల్ అనిశ్చితి మధ్య భారత ఆర్థిక వ్యవస్థను మరింత స్థిరంగా, పోటీశీలంగా మార్చే మార్గాలపై కూడా ఈ భేటీలో సమీక్ష జరిగినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















