భద్రాచలంలో గిరిజన మహిళల ఆర్థిక సాధికారతకు ప్రతీకగా నిలుస్తున్న భద్రగిరి మార్ట్ అద్భుత విజయాన్ని నమోదు చేస్తోంది. ఐటీడీఏ సహకారంతో పూర్తిగా మహిళల నిర్వహణలో కొనసాగుతున్న ఈ మార్ట్‌కు వినియోగదారుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.
మార్చి 28న గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రారంభించిన ఈ మార్ట్ కేవలం రెండు నెలల్లోనే రూ.30 లక్షలకు పైగా విక్రయాలు నమోదు చేయడం విశేషం. నాణ్యమైన ఉత్పత్తులు, సరసమైన ధరలు, గిరిజన మహిళల స్వయం ఉపాధికి మద్దతు అనే లక్ష్యాలతో ముందుకు సాగుతున్న ఈ కేంద్రం రోజుకు సగటున 500 మందికి పైగా వినియోగదారులను ఆకర్షిస్తోంది. రోజువారీగా రూ.50 వేల వరకు వ్యాపారం జరుగుతోంది.
ఈ మార్ట్ ఏర్పాటుకు ఐటీడీఏ సుమారు రూ.10 లక్షల పెట్టుబడి సాయం అందించగా, ఆ మొత్తాన్ని కేవలం 20 రోజుల్లోనే తిరిగి చెల్లించడం గిరిజన మహిళల పట్టుదలకు నిదర్శనంగా నిలిచింది.
గిరిజన మహిళలు తయారు చేసిన వివిధ ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ వేదిక లేకపోవడంతో వారు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించిన భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాహుల్ ప్రత్యేక చొరవతో ఈ మార్ట్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇక్కడ గిరిజన సహకార సంస్థ (GCC) ఉత్పత్తులైన తేనె, పసుపు, కారం, చింతపండు వంటి వస్తువులతో పాటు మహిళా సంఘాలు తయారు చేసిన సబ్బులు, మిల్లెట్ బిస్కెట్లు, శానిటరీ ప్యాడ్స్, షాంపూలు, ఇప్ప లడ్డూలు, పచ్చళ్లు, వెదురు కళాకృతులు, తాటాకు బుట్టలు అందుబాటులో ఉన్నాయి.
అంతేకాకుండా రైతుల నుంచి నేరుగా సేకరించిన సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులను కూడా విక్రయిస్తున్నారు. దీంతో వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు లభిస్తుండగా, గిరిజన మహిళలకు స్థిరమైన ఆదాయం సమకూరుతోంది.
భద్రగిరి మార్ట్ విజయం గ్రామీణ, గిరిజన మహిళల ఆర్థిక స్వావలంబనకు ఆదర్శంగా నిలుస్తూ ఇతర ప్రాంతాలకు స్ఫూర్తిగా మారుతోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















