నూతన భారత నిర్మాణంలో బొగ్గు రంగం అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. దేశంలో బొగ్గు ఉత్పత్తి, సరఫరాపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి వారం సమీక్ష నిర్వహిస్తున్నారని వెల్లడించారు.
హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన కిషన్‌రెడ్డి, గతంలో బొగ్గు రంగంలో భారీ అవకతవకలు జరిగాయని, కాంగ్రెస్ హయాంలో కేటాయించిన కోల్ మైన్స్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బొగ్గు రంగంలో పారదర్శకత, సంస్కరణలకు పెద్దపీట వేసినట్లు తెలిపారు.
ప్రస్తుతం దేశంలో 189 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని, గతంలో చైనా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా వంటి దేశాలపై ఆధారపడిన భారత్ ఇప్పుడు దిగుమతులను తగ్గించే దిశగా అడుగులు వేస్తోందన్నారు. దేశీయ ఉత్పత్తిని పెంచి ఇంధన భద్రతను బలోపేతం చేయడమే లక్ష్యమని వివరించారు.
భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అండర్‌గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ సాంకేతికతపై అధ్యయనం కొనసాగుతోందని, ఈ నెల 11న ప్రైవేట్ కంపెనీలతో కీలక సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. 2028 నాటికి అన్ని కోల్ బ్లాక్స్ అభివృద్ధి, వినియోగంపై కార్యాచరణ అమలు చేస్తామని చెప్పారు.
అదే సమయంలో దేశానికి అవసరమైన కీలక ఖనిజాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. క్రిటికల్ మినరల్స్ మిషన్ కోసం రూ.1,500 కోట్లు కేటాయించామని, ప్రస్తుతం 24 కీలక ఖనిజాలను దిగుమతి చేసుకుంటున్నామని వెల్లడించారు. అర్జెంటీనాలో ఆరు క్రిటికల్ మినరల్స్ బ్లాక్స్‌ను సొంతం చేసుకుని భవిష్యత్ అవసరాలకు ముందస్తు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు.
దేశ ఇంధన భద్రత, పారిశ్రామిక అభివృద్ధి, వ్యూహాత్మక ఖనిజాల లభ్యత కోసం కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు భారత ఆర్థిక వ్యవస్థకు మరింత బలం చేకూర్చనున్నాయని కిషన్‌రెడ్డి అన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews
















