మార్కాపురం జిల్లా పొదిలి మండలం రాజుపాలెం గ్రామ శివారులో 2017లో చోటుచేసుకున్న కంచర్ల శ్రీను హత్య కేసులో 13 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ మార్కాపురం ఆరో అదనపు జిల్లా సెషన్స్ న్యాయమూర్తి జస్టిస్ వేల్పుల భవాని బుధవారం తీర్పు వెలువరించారు. ఈ తీర్పుతో తొమ్మిదేళ్లుగా సాగుతున్న న్యాయపోరాటానికి ముగింపు పలికినట్లైంది.
గ్రామంలో బొడ్రాయి వద్ద ప్రారంభమైన చిన్నపాటి వివాదం క్రమంగా పెద్ద స్థాయికి చేరి గ్రామ రాజకీయాలు, కుల విభేదాలు, స్థానిక వ్యవహారాలపై తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. కంచర్ల శ్రీను మరియు నిందితుల మధ్య నెలకొన్న విభేదాలు చివరికి ప్రాణాంతక దాడికి కారణమయ్యాయి.
2017 మే 17వ తేదీ రాత్రి సుమారు 11 గంటల సమయంలో, శ్రీను పొదిలి నుంచి రాజుపాలేనికి మోటార్‌సైకిల్‌పై వెళుతుండగా, ముందస్తు ప్రణాళిక ప్రకారం అడ్డగించి గొడ్డళ్లు, కత్తులు, ఇనుప రాడ్లతో దారుణంగా దాడి చేశారు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మరణించినట్లు పోలీసులు తెలిపారు.
మృతుని భార్య కె.కాశీలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు. సాక్ష్యాధారాలు సేకరించి, ప్రత్యక్ష సాక్షులను విచారించి, నిందితులపై చార్జ్‌షీట్ దాఖలు చేశారు. విచారణ ప్రక్రియ తొమ్మిదేళ్లపాటు కొనసాగింది.
కోర్టు విచారణలో నిందితులపై ఆరోపణలు రుజువుకావడంతో 13 మందిని దోషులుగా తేల్చి, యావజ్జీవ కారాగార శిక్షతోపాటు ఒక్కొక్కరికి రూ.1,000 చొప్పున జరిమానా విధించారు. నిందితుల్లో 12 మంది రాజుపాలెం గ్రామానికి చెందినవారు కాగా, ఒకరు కొత్తపాలేనికి చెందినవారు.
తీర్పు వెలువడిన అనంతరం నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని నెల్లూరు కారాగారానికి తరలించారు. ఈ సందర్భంగా పొదిలి సీఐ ఎం.రాజేష్‌కుమార్ మాట్లాడుతూ, న్యాయం సాధించేందుకు కృషి చేసిన దర్యాప్తు బృందాన్ని అభినందించారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews


















