దంపతులు విడిపోయిన కేసుల్లో భరణం హక్కుపై బాంబే హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. భర్త మరణానంతరం కూడా మాజీ భార్యకు అతని ఆస్తి నుంచి భరణం పొందే హక్కు కొనసాగుతుందని కోర్టు స్పష్టం చేసింది. అయితే, పెరిగిన జీవన వ్యయాలు లేదా వైద్య ఖర్చులను కారణంగా చూపుతూ భరణం మొత్తాన్ని పెంచాలని కోరడం సముచితం కాదని తేల్చింది.
జస్టిస్ భారతి, జస్టిస్ మంజూషా దేశ్‌పాండే ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. భర్త జీవించి ఉన్న సమయంలో ఆస్తులు పెరిగిన సందర్భాల్లో మాత్రమే భరణం పెంపు అంశాన్ని పరిశీలించవచ్చని కోర్టు పేర్కొంది.
ఈ కేసులో 2012 మార్చిలో భర్త నరేన్ గోరెగావోంకర్ మరణించడంతో భరణం చెల్లింపులు నిలిచిపోయాయి. దీంతో 62 ఏళ్ల వయసున్న వర్ష కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పెండింగ్‌లో ఉన్న భరణం మొత్తం చెల్లించాలని న్యాయస్థానం నరేన్ వారసులను ఆదేశించింది.
అయితే భరణం మొత్తాన్ని పెంచాలన్న వర్ష అభ్యర్థనను కుటుంబ న్యాయస్థానం తోసిపుచ్చింది. దీనిపై ఆమె బాంబే హైకోర్టును ఆశ్రయించగా, హైకోర్టు కూడా కుటుంబ న్యాయస్థానం తీర్పును సమర్థించింది.
మాజీ భర్త వారసులు తమ స్వయంకృషితో వృద్ధి చేసిన ఆస్తుల ఆధారంగా భరణం పెంపు చేయడం సముచితం కాదని హైకోర్టు స్పష్టం చేసింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















