కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వైకాపా అధినేత జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. జగన్‌కు డబ్బు ఆశ తప్ప రాష్ట్ర అభివృద్ధి పట్టదని ఆయన ధ్వజమెత్తారు. గుంటూరులో గురువారం నిర్వహించిన కూటమి సుపరిపాలన రెండేళ్ల విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఇప్పటికే రూ.860 కోట్లతో రోడ్ల గుంతలు పూడ్చి మరమ్మతులు చేపట్టామని, అలాగే రూ.2,500 కోట్లతో రహదారుల అభివృద్ధి పనులు పూర్తి చేసినట్లు వెల్లడించారు. అదేవిధంగా 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూసమస్యలను పరిష్కరించామని చెప్పారు.
అమరావతి అభివృద్ధి ప్రాజెక్టులపై కూడా ఆయన వివరాలు వెల్లడించారు. సీఎం చంద్రబాబు విజన్ ప్రకారం అమరావతి ఔటర్ రింగ్ రోడ్డును 140 మీటర్ల వెడల్పుతో, రెండు వైపులా సర్వీసు రోడ్లు, ప్రతి గ్రామానికి అనుసంధానం చేసే లింక్ రోడ్లతో నిర్మించాలంటే రూ.35 వేల కోట్ల నుంచి రూ.40 వేల కోట్ల వరకు వ్యయం అవుతుందని తెలిపారు. అయితే మొదటి దశలో సర్వీసు రోడ్లు, లింక్ రోడ్లు లేకుండా ప్రాజెక్టును రూ.25 వేల కోట్ల నుంచి రూ.30 వేల కోట్లతో పూర్తి చేయాలని ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వివరించారు. రెండో దశలో సర్వీసు రోడ్లు నిర్మిస్తామని తెలిపారు.
ఈ రింగ్ రోడ్ ప్రాజెక్టు రాష్ట్ర అభివృద్ధికి బార్‌కోడ్‌లా పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. వైకాపా నాయకులు కులాలు, మతాల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని, ప్రజలు దీనిని గమనించాలని కోరారు.
జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాబోయే మూడేళ్లలో రాష్ట్రాన్ని సమగ్ర అభివృద్ధి దిశగా తీసుకువెళ్లేందుకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు భాష్యం రామకృష్ణ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















