అమెరికా ప్రభుత్వం భారత్‌కు విక్రయించిన కీలక ఆయుధాలకు సంబంధించిన సర్వీసులను అందించేందుకు అంగీకరించింది. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ అక్కడి కాంగ్రెస్‌కు అధికారికంగా తెలియజేసింది.
ఈ ఒప్పందం ప్రకారం అపాచీ ఎటాక్ హెలికాప్టర్లు, ఎం777ఏ2 అల్ట్రాలైట్ హోవిట్జర్ గన్స్‌కు సంబంధించిన నిర్వహణ, లాజిస్టిక్స్, శిక్షణ, సాంకేతిక సహాయం వంటి సేవలను అమెరికా అందించనుంది. ఈ డీల్ విలువ సుమారు 482 మిలియన్ డాలర్లుగా అంచనా వేయబడింది.
విదేశాలకు ఆయుధాల విక్రయాలను పర్యవేక్షించే డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ ఇటీవల ఈ సర్వీసులకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో భారత సైన్యం వినియోగిస్తున్న ఈ కీలక ఆయుధాల నిర్వహణలో ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగుతుంది.
ఈ సర్వీసుల ద్వారా ఆయుధాల లాజిస్టిక్స్, టెక్నికల్ సపోర్ట్, ట్రైనింగ్ సౌకర్యాలు మరింత బలపడనున్నాయి. అమెరికాలోని బోయింగ్, లాక్‌హీడ్ మార్టిన్ కంపెనీలు అపాచీ హెలికాప్టర్లకు సపోర్ట్ అందించగా, బీఏఈ సిస్టమ్స్ ఎం777 గన్స్‌కు సర్వీసు కాంట్రాక్టర్‌గా వ్యవహరించనుంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















