మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ మాట్లాడుతూ ‘ఆపరేషన్ విజయవంతమైంది. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆత్మవిమర్శ చేసుకోవాల్సినవారు చేసుకుంటారు’ అని వ్యాఖ్యానించారు.
ఒక ఆపరేషన్‌ను చేపట్టిన తర్వాత దాన్ని మధ్యలో వదిలిపెట్టబోనని, ఇప్పటికే ఆ విషయాన్ని తాను నిరూపించుకున్నానని ఉప ముఖ్యమంత్రి, శివసేన అధ్యక్షుడు ఏక్‌నాథ్ శిందే తెలిపారు.
శివసేన (యూబీటీ) ఎంపీల చీలికకు సంబంధించి ‘ఆపరేషన్ టైగర్’ కొనసాగుతోందన్న వార్తల నేపథ్యంలో ఆదివారం ఇద్దరు నేతలు ఉమ్మడిగా మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఫడణవీస్ మాట్లాడుతూ త్వరలోనే పెద్ద రాజకీయ పరిణామాలు వెలుగులోకి వస్తాయని సంకేతాలు ఇచ్చారు. ఎంపీలను దూషించి ఇప్పుడు తిరిగి రమ్మనడం సరైన పద్ధతి కాదని ఆయన వ్యాఖ్యానించారు.
శివసేన అంటే కేవలం పార్టీ మాత్రమే కాదని, అది బాల్ ఠాక్రే సిద్ధాంతాల వారసత్వమని ఆయన అన్నారు. ఆ సిద్ధాంతాలను కొనసాగిస్తున్నది శిందే నేతృత్వంలోని శివసేనేనని ఫడణవీస్ స్పష్టం చేశారు.
శివసేన (యూబీటీ) నేత ఉద్ధవ్ ఠాక్రే ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆయన సూచించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















