బ్రిటన్‌లో మరోసారి రాజకీయ సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ తన పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు.
లేబర్ పార్టీ నుంచి పెరుగుతున్న ఒత్తిడి కారణంగానే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. తాను పదవిలో ఉన్నంత కాలం విలువలకు కట్టుబడి పనిచేశానని పేర్కొన్నారు.
ఈ పరిణామంతో గత దశాబ్ద కాలంలో బ్రిటన్‌లో పదవులు వదిలిన ప్రధానుల సంఖ్య ఆరుకు చేరినట్లు తెలుస్తోంది.
కీర్ స్టార్మర్ 2024లో బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే స్థానిక ఎన్నికల్లో లేబర్ పార్టీ పేలవ ప్రదర్శన చేయడం, మేకర్‌ఫీల్డ్ ఉపఎన్నికల్లో ప్రత్యర్థి విజయం సాధించడం వంటి పరిణామాలతో ఆయన నాయకత్వంపై ప్రశ్నలు తలెత్తాయి.
అలాగే ఎప్‌స్టీన్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తన స్నేహితుడు పీటర్ మాండెల్సన్‌ను అమెరికాలో యూకే రాయబారిగా నియమించాలనే నిర్ణయంపైనా తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ అంశాలపై పార్టీ లోపలే అసంతృప్తి పెరిగింది.
తనపై ఉన్న ఒత్తిడుల మధ్య కూడా పదవి నుంచి తప్పుకునే ఆలోచన లేదని గతంలో స్టార్మర్ స్పష్టం చేసినప్పటికీ, చివరకు రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఇక ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో స్పందిస్తూ స్టార్మర్ రాజీనామా చేస్తారని ముందే వ్యాఖ్యానించారు. వలసలు, ఇంధన విధానాల్లో వైఫల్యాలే కారణమని ఆయన పేర్కొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















