ఖతార్‌లోని రస్ లఫాన్ పారిశ్రామిక నగరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గ్యాస్ క్షేత్రంలో ఆదివారం రాత్రి జరిగిన భారీ పేలుడులో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 12 మంది భారతీయులు కాగా, మరొకరిని పాకిస్థాన్ సంతతి వ్యక్తిగా గుర్తించారు.
ఈ ఘటనలో మొత్తం 66 మంది గాయపడ్డారు. వారిలో ఖతార్, భారత్, పాకిస్థాన్ సహా పలు దేశాల కార్మికులు ఉన్నట్లు సమాచారం. గాయపడినవారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని దోహాలోని భారత రాయబార కార్యాలయం ‘ఎక్స్’ ద్వారా తెలిపింది. మృతుల కుటుంబాలకు అవసరమైన సహాయం అందిస్తామని కూడా వెల్లడించింది.
పశ్చిమాసియా యుద్ధ సమయంలో రస్ లఫాన్ ప్రాంతంపై జరిగిన దాడుల కారణంగా గ్యాస్ ఉత్పత్తి తాత్కాలికంగా నిలిపివేయబడిన విషయం తెలిసిందే. పరిస్థితులు మెరుగుపడటంతో మళ్లీ కార్యకలాపాలు ప్రారంభించేందుకు కార్మికులు ప్రయత్నిస్తుండగా, బర్జాన్ గ్యాస్ సరఫరా ప్లాంట్‌లో సాంకేతిక లోపం కారణంగా భారీ పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది.
పేలుడు అనంతరం పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది. అంతర్జాతీయ గ్యాస్ వాణిజ్యంలో కీలక పాత్ర పోషించే రస్ లఫాన్ కేంద్రంగా ఉంది. ఇక్కడి నుంచి భారత్ సహా సుమారు 30 దేశాలకు గ్యాస్ ఎగుమతులు జరుగుతాయి.
బర్జాన్ గ్యాస్ ప్లాంట్ రోజుకు సుమారు 140 కోట్ల స్టాండర్డ్ క్యూబిక్ ఫీట్ గ్యాస్ ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉండటంతో, తాజా ఘటన గ్లోబల్ ఎనర్జీ సరఫరా గొలుసుపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















