పింఛను సేవల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తూ పింఛను నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (పీఎఫ్‌ఆర్‌డీఏ) తమ చందాదారుల కోసం కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత ఫిర్యాదుల పరిష్కార వేదికను ప్రారంభించింది. ‘పీఎఫ్‌ఆర్‌డీఏ పెన్షన్ సహాయక్’ పేరుతో తీసుకొచ్చిన ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా పింఛను సేవలు మరింత వేగంగా, సులభంగా అందుబాటులోకి రానున్నాయి.
ఈ పోర్టల్ 22 భారతీయ భాషల్లో సేవలు అందించనుండటం దీని ప్రత్యేకత. కేంద్ర ప్రభుత్వ ‘భాషిణి’ సాంకేతికతతో అనుసంధానం చేయడం వల్ల వినియోగదారులు తమ మాతృభాషలోనే ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చు. ముఖ్యంగా వృద్ధులు, గ్రామీణ ప్రాంతాల చందాదారులు, టైపింగ్ తెలియని వారు కూడా వాయిస్ ద్వారా ఫిర్యాదులు నమోదు చేసే అవకాశం కల్పించారు. అలాగే స్పందనలు ఆడియో రూపంలోనూ పొందవచ్చు.
ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను మరింత సమర్థవంతంగా చేయడానికి ఆటోమేటెడ్ ఎస్కలేషన్ వ్యవస్థను ఇందులో పొందుపర్చారు. నిర్దేశిత గడువులోగా సమస్య పరిష్కారం కాకపోతే, ఆ ఫిర్యాదు ఆటోమేటిక్‌గా ఉన్నతాధికారుల దృష్టికి చేరుతుంది. దీంతో ప్రతి సమస్యకు వేగవంతమైన పరిష్కారం లభించే అవకాశం ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వ ‘నెక్స్ట్-జెన్ CPGRAMS’ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ వేదికను అభివృద్ధి చేసినట్లు పీఎఫ్‌ఆర్‌డీఏ తెలిపింది. పారదర్శకత, జవాబుదారీతనం, సులభతరం అనే లక్ష్యాలతో రూపొందించిన ఈ ఏఐ ఆధారిత బహుభాషా వేదిక పింఛను ఫిర్యాదుల పరిష్కారంలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని సంస్థ పేర్కొంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















