నిర్మల్ జిల్లాలోని బాసర మహంకాళి ఉప ఆలయంలో జరిగిన చోరీ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సోమవారం రాత్రి అర్ధరాత్రి సమయంలో దుండగులు ఆలయంలోకి చొరబడి దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మంగళవారం వేకువజామున అభిషేకం కోసం వెళ్లిన పూజారులు ఆలయ తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించి వెంటనే ఈఓ అంజనీదేవి, పోలీసులకు సమాచారం అందించారు.
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రాథమిక పరిశీలనలో అమ్మవారి 1.226 కిలోల వెండి కిరీటం మరియు ఆలయ హుండీ నగదు దోపిడీకి గురైనట్లు గుర్తించారు. సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలించగా, రాత్రి 12 గంటల 17 నిమిషాలకు గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలోకి ప్రవేశించి ఈ చోరీకి పాల్పడినట్లు నిర్ధారించారు.
రాత్రి విధుల్లో ఏడుగురు హోంగార్డులు ఉండాల్సి ఉండగా కేవలం ఇద్దరు మాత్రమే హాజరైనట్లు తెలిసింది. ఇదే అవకాశంగా దుండగులు ఆలయంలోకి ప్రవేశించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై ఈఓ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ముథోల్ సీఐ దర్యాప్తు ప్రారంభించారు. దోషులను గుర్తించి త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















