ఖైరతాబాద్ బడా గణేశుడు ఈ ఏడాది ‘పంచముఖ సంకటహర మహాగణపతి’గా రూపుదిద్దుకోనున్నాడు. ఈ మేరకు విగ్రహ ఏర్పాట్లకు సంబంధించిన తొలి పూజ (కర్రపూజ)ను నిర్మల ఏకాదశి పురస్కరించుకుని గురువారం సాయంత్రం ఖైరతాబాద్ మండపం వద్ద ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ నిర్వహించింది.
ఈ ఏడాది విగ్రహం 69 అడుగుల ఎత్తు, 20 అడుగుల వెడల్పుతో ఐదు తలలు, ఎనిమిది చేతులతో ప్రత్యేక ఆకృతిలో కొలువుదీరనుంది. విగ్రహ నమూనాను ఉత్సవ కమిటీ అధ్యక్షుడు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ తదితరులు విడుదల చేశారు.
గణపతి విగ్రహానికి కుడివైపున సోమనాథ్ జ్యోతిర్లింగం, ఎడమవైపున కాళీమాత విగ్రహాలను ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ఏడాది ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవాలు 72వ ఏట కొనసాగుతున్నాయని కమిటీ వెల్లడించింది.
వేడుకల ప్రారంభం సెప్టెంబర్ 14న జరగనుండగా, అవసరమైన అన్ని ఏర్పాట్లపై ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ శాఖలకు సూచనలు చేసినట్లు దానం నాగేందర్ తెలిపారు. కర్రపూజలో తితిదే పంపిన పసుపు, కుంకుమలను వినియోగించినట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టు సాయికుమార్, మాజీ కార్పొరేటర్ విజయారెడ్డి, గణేశ్ ఉత్సవ కమిటీ ఛైర్మన్ రాజ్ కుమార్, కన్వీనర్ సందీప్, శిల్పి రాజేంద్రన్ తదితరులు పాల్గొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















