పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌పై గతేడాది చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’లో దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరజవాన్ల పేర్లను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ పేర్లను నేషనల్ వార్ మెమోరియల్ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరచినట్లు వెల్లడించింది.
ఈ ఆపరేషన్‌లో ఐదుగురు ఆర్మీ అధికారులు, ఓ అగ్నివీర్ దేశ రక్షణ కోసం పోరాడుతూ వీరమరణం పొందారు. వీరి పేర్లను దేశ రాజధాని దిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఉన్న జాతీయ యుద్ధ స్మారకంలో ప్రత్యేక శిలాఫలకంపై శాశ్వతంగా చెక్కనున్నట్లు సమాచారం.
అమరుల వివరాలు ఇలా ఉన్నాయి:
సుబేదార్ మేజర్ పవన్ కుమార్ (10 ఇన్‌ఫాంట్రీ బ్రిగేడ్ హెడ్‌క్వార్టర్స్),
రైఫిల్‌మ్యాన్ సునీల్ కుమార్ (జమ్మూకశ్మీర్ లైట్ ఇన్‌ఫాంట్రీ రెజిమెంట్ 4వ బెటాలియన్),
లాన్స్ నాయక్ దినేశ్ కుమార్ (5 ఫీల్డ్ రెజిమెంట్),
హవల్దార్ సునీల్ కుమార్ సింగ్ (237 ఫీల్డ్ వర్క్‌షాప్),
సార్జెంట్ సురేంద్ర కుమార్ (ఎయిర్‌ఫోర్స్ 39వ వింగ్),
అగ్నివీర్ మురళీ నాయక్ (851 లైట్ రెజిమెంట్).
వీరిలో రైఫిల్‌మ్యాన్ సునీల్ కుమార్‌కు మరణానంతరం మూడో అత్యున్నత యుద్ధ పురస్కారం ‘వీర చక్ర’ ప్రకటించగా, సార్జెంట్ సురేంద్ర కుమార్‌కు ‘వాయు మెడల్’తో గౌరవం లభించింది. అగ్నివీర్ మురళీ నాయక్ తెలుగు వ్యక్తి కావడం విశేషం. శ్రీసత్యసాయి జిల్లా కళ్లితండాకు చెందిన ఆయన 2022లో అగ్నివీర్‌గా చేరి పంజాబ్, అస్సాంల్లో సేవలందించారు.
2025 ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు మృతి చెందగా, దీనికి ప్రతీకారంగా మే 7న భారత్ పాకిస్థాన్‌లోని ఉగ్ర శిబిరాలపై దాడులు చేపట్టింది. ఆపరేషన్ సిందూర్‌లో వీరమరణం పొందిన జవాన్ల త్యాగాన్ని దేశం స్మరించుకుంటోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















