అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌లో పర్యటించనున్నారు. వచ్చే ఏడాదిలో ఆయన పర్యటన జరిగే అవకాశం ఉందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో వెల్లడించారు.
భారత్–అమెరికా మధ్య సంబంధాలు అత్యంత అద్భుతంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అధ్యక్షుడు ట్రంప్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు ఖరారు చేయడానికి ఈ ఏడాది ముగిసేలోపే తాను భారత్‌ను సందర్శించనున్నట్లు కూడా తెలిపారు.
రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రంప్ చేసే మొదటి భారత పర్యటన ఇదేనని సమాచారం. అమెరికాకు భారత్ అత్యంత కీలక భాగస్వామి అని, ప్రధాని నరేంద్ర మోదీ మరియు డొనాల్డ్ ట్రంప్ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని రూబియో తెలిపారు.
దౌత్యపరంగా వారి అనుబంధం రెండు దేశాలకు ఎంతో ఉపయోగకరమని ఆయన అన్నారు. ఇటీవల ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 సదస్సులో మోదీ–ట్రంప్ మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరిగినట్లు ఆయన వెల్లడించారు.
ఇరుదేశాల మధ్య వాణిజ్య చర్చలు త్వరలోనే పూర్తవుతాయని, ఇంధన సరఫరా రంగంలో కూడా భారత్–అమెరికా కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు. చమురు శుద్ధి సామర్థ్యం ఉన్న కొన్ని దేశాల్లో భారత్ కూడా ఒకటని మార్కో రూబియో పేర్కొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















